

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 25
తర్లుపాడు మండలం లోని గానుగపెంట, రాగసముద్రం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి పి. జ్యోష్నదేవి నిర్వహించారు,ఈ సందర్బంగా ఎఓ పి జ్యోష్నదేవి మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు గురించి వివరించారు, రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు నాన్యమైనవి కొనుగోలు చేయాలనీ, ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన దుకానాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలనీ, కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువు లకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, తీసుకున్న ఎరువులు, విత్తన సంచులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం లో రాగసముద్రం సర్పంచ్ తాడి రమణారెడ్డి, రైతు సేవాకేంద్రం సిబ్బంది మునికాసయ్య, బొర్రయ్య, మల్లికార్జున రైతులు పాల్గొన్నారు