

జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించాలని పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. మంగళవారం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు రాసిన లేఖను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే రోగులు సంఖ్య పెరగటంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.70 ఎకరాల్లో 1500 పడకలతో నిర్మించిన వైద్య కళాశాలలోనికి ఆసుపత్రిని మార్చితే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.