Listen to this article

జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని తడపాకల్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కవిత కుమారుడు ఫణీంద్ర పుట్టినరోజు సందర్భంగాబుధవారం రోజునాఅదే పాఠశాలలో పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు ,ఇంగ్లీష్ కి సంబంధిన 4000 రూపాయల విలువ గల చూచి వ్రాత పుస్తకాలను సొంత ఖర్చుతో తెప్పించి విద్యార్థులకు అందించారు.ఈ సందర్భంలో ప్రధానోపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ, విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు,చదువు జీవితాన్ని మలుపుతిప్పే శక్తిగా పనిచేస్తుందని పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే చదువుపట్ల ప్రేమ పెరిగాలి అని అన్నారు.ఈ కార్యక్రమమును ఉద్దేశించి పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షులుకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇతర పాఠశాలలకు,అలాగే గ్రామ ప్రజలకు, గ్రామం లో స్థిరపడిన యువకులకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా చదువుకున్న బడికి సేవ చేసే దృక్పథం ఉన్న వారందరికీ స్ఫూర్తిదాయకమయ్యేలా
ఉందని నిత్యజీవితంలో ఇలా పాఠశాల అభివృద్ధికొరకు తోడ్పడేటువంటి మంచి పనులలో అందరూ ముందుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్, శ్రావణి, సుధాకర్, చక్రపాణి, రవి పాల్గొన్నారు..