

కనీసం ఆరా తీయని ప్రభుత్వ అధికారులు.
(జనం న్యూస్ 25;జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల పంచాయతీ పరిధి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహాల గురించి ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసింది.కానీ గ్రామాలలో రెండు మూడు లిస్టులు చెబుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ప్రజల్ని మోసం చేస్తున్న సంగతి ఎవరు గమనించలేకపోవడం విశేషం. మొదలిస్టులో కొన్ని పేర్లు ఉండగా రెండవ లిస్టులో అసలు పేరు లేకపోవడం అనేది గమనార్హం. అని ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పూర్తి సమాచారం సేకరించకుండా కమిటీ సభ్యులు ఇష్టం వచ్చిన రీతిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని, ఈసంఘటనలకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా దర్యాప్తు చేసి అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొదటి లిస్టులో పేర్లు ఉన్నటువంటి వారి యొక్క పేర్లు డిలీట్ అయినయని పత్రిక ముఖంగా వారి యొక్క ఉద్దేశాలను తెలియజేశారు. ఇకనైనా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు మేలుకొని సరైనటువంటి వాళ్లకు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు
