Listen to this article

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్

జనం న్యూస్ జూన్ 26( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రెైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ దాంట్లో భాగంగా రైతు భరోసా పెట్టుబడి సాయం రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదు చేసిందన్నారు.గత ఏడేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడమే నిదర్శనమన్నారు. సాగులో ఉన్న ప్రతి గుంట భూమికి నిధులు జమ చేసారని ఎకరాకు రూ 6,000 చొప్పున ప్రజా ప్రభుత్వం నిధులు జమ చేసి రికార్డు సృష్టించిందని అన్నారు.రైతుల సంక్షేమంలో రాజీ లేకుండా వ్యవసాయాన్ని పండుగలా చేసే ఆలోచనతో “రైతే రాజు” అనే నినాదంతో, ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందన్నారు. దేశంలో ఏక్కడ లేని విధంగా రైతులు పండించిన సన్నధాన్యం క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ను అందిస్తుంది తెలంగాణ ప్రజా ప్రభుత్వమే అని కొనియాడారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.