

జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుదవారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్, మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని,ప్రతి అమావాస్య రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభిందనీయం అని, ఈరోజు కీర్తిశేషులు అత్తెల్లి భద్రయ్య, బాల్ లక్ష్మీ దంపతుల జ్ఞాపకార్థం అత్తెల్లి అంజయ్య,విజయలక్ష్మి, మరియు అత్తెల్లి లక్ష్మయ్య పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్,ప్రశాంతి, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, మాజీ వైస్ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య, ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ,రుక్మయ్య, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్,కాశీనాథ్,మహేందర్, సిద్ది రామచంద్రం,నవీన్, కొమరవెల్లి ప్రవీణ్, కైలాస ప్రశాంత్,వెంకటేష్, నరేష్ , సిద్ధేశ్వర, దూబకుంట లచ్చలు, శంకరయ్య,గందే సంతోష్, పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, నాగరాజు నేత,ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
