Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 25)

సిద్దిపేట జిల్లా:తేదీ: 25.06.2025


మల్లన్నసాగర్ ప్రాజెక్టు 12వ ప్యాకేజ్ పనులపై ఇరిగేషన్ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష – నష్టపోయిన 12 గ్రామాల రైతులతో ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు 12వ ప్యాకేజ్ పనులపై బుధవారం ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు మరియు ప్రాజెక్టు వల్ల నష్టపోయిన 12 గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ “ఇరిగేషన్ అధికారులు వందల కోట్ల రూపాయలతో పట్టుబడుతున్నారు. కానీ రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. ఏసీ కార్యాలయాల్లో కూర్చునే సమయంలో కాదు ఇది, రైతు జీవితంతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.”18 నెలలు గడిచినా ఒక్క సమీక్షా జరగలేదు. ప్రజాప్రతినిధులతో చర్చ చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ఇది తగదు. ఇప్పటికైనా మిగిలిన పనులను నెలరోజుల్లో పూర్తి చేసి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో నీటి పంపిణీ చేపట్టాలి,” అని అధికారులకు కఠినంగా సూచించారు.2022లో ప్రారంభమైన పనులు నేటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని అభిప్రాయపడుతూ, “తొగుట, మిడిదొడ్డి, దుబ్బాక మండలాల్లో రేపటి నుంచే ఇరిగేషన్ అధికారులు ఫీల్డ్‌లో ఉండాలి. కార్యాలయాల్లో కూర్చొని వ్యవస్థను నడిపే రోజులు పోయాయి,” అని హెచ్చరించారు.దుబ్బాక నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, రైతు జీవితం మా ప్రాధాన్యత. సాగునీటి హక్కు ప్రతి రైతుకు లభించే వరకు మా పోరాటం కొనసాగుతుంది, అని ఎంపీ స్పష్టం చేశారు.