Listen to this article

జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలము: అంతర్జాతీయ మారక ద్రవ్యల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం భాగంగా ఈ నెల 20నుండి 26వరకు యాంటీ -డ్రగ్ అవగాహనా వారోత్సవాలభాగంగా భీంగల్ ప్రాజెక్టు పరిధిలో గల ఏర్గట్ల మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బుధవారం రోజునా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి స్థానిక ఏ ఎస్సై లక్ష్మన్ నాయక్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, గంజాయి లకు అలవాటు పడి యువత నిండు జీవితాలకు నాశనం చేసుకొంటున్నారు. దీనివల్ల మిమ్ములను కన్న తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటున్నారు. వారి కలలను ఆడి ఆశలు చెయ్యవద్దు అన్నారు. మీ చుట్టూ ప్రక్కల ఎవరైనా అలాంటి వాటికి పాలుపడితే పోలీస్ సిబ్బంది కి చెప్పాలని,మత్తు కు బానిసలుగా మరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మాట్లాడారు.డి హెచ్ ఇ డబ్ల్యూజెండర్ స్పెషలిస్ట్ సౌమ్య మాట్లాడుతూ మత్తు మరియు మాదక ద్రవ్యలకు అలవాటు పడితే వాటి వలన కలిగే నష్టాల గురించి విద్యార్థులకుక్లుప్తంగా వివరించారు. అంతే కాకుండా షాట్ ఫిల్మ్ షో ద్వారా పిల్లలకు చైతన్య పర్చడం జరిగింది.విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమం లో ఐ సి డి ఎస్ సూపర్వైజర్సరస్వతి, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మునిరోద్దీన్, అంగనివాడి టీచర్లు, చంద్రకళ, సుజాత., శోభ, సులోచన, శారదా మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.