Listen to this article

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో బెంబేలెత్తిస్తున్న ఆవులు, ఆబోతులు

కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ఆవులు, ఆబోతుల సంచారం ఎక్కువగా ఉంది. ఆర్ అండ్ బి రోడ్డుపై నిత్యం సంచరిస్తూ ప్రయాణికులనుహడాలెత్తిస్తున్నాయి.పలు సందర్భాల్లో ఆ బూతులు వల్ల పలువురు గాయపడ్డ సంఘటనలు కాట్రేనికోనలో జరిగాయి. యజమానులు పాలు తీసుకుని వాటిని రోడ్లపై వదిలేస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపుల్లోకి ఈ ఆవులు చొరబడుతున్నాయి. పేడ మూత్రం పోస్తున్నాయి. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని బాధిత షాపుల యజమానులు అంటున్నారు. ఆవులను స్వాధీనం చేసుకుని వాటిని కరవాక వంటి అటవీ ప్రాంతానికి తరలించాలని కాట్రేనికోన ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.