

జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కుంటిన వలస గ్రామంలో గల అంగన్వాడి సెంటర్ -2లో పిల్లలకు పెను ప్రమాదం తప్పింది. ఎప్పటినుండో పాత బిల్డింగ్ లో నిర్వహిస్తున్న అంగన్వాడి సెంటర్ ను మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా బిల్డింగ్ బాగా తడిసి స్లాబ్ పెచ్చులు పడ్డాయి. ఆ స్థలంలో పిల్లలు కానీ టీచరు గాని లేకపోవడంతో ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. విషయం తెలుసుకున్న పిఓ రాజేశ్వరి, సూపర్వైజర్ హైమా హుటా హుటిన అంగన్వాడి సెంటర్ కు చేరుకున్నారు. ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా పీవో రాజేశ్వరి వెంటనే సెంటర్ మార్చాలని పిల్లలకు మంచిగా ఉండేదిగా ఏర్పాటు చేయాలని సంబంధిత అంగన్వాడి కార్యకర్తకు,సూపర్వైజర్ ను ఆదేశించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పి రమేష్ నాయుడు సెంటర్ కి వచ్చి అధికారులను కలిసి అంగన్వాడి సెంటర్ మరో బిల్డింగ్ లో కి మార్చడానికి సహకరిస్తానన్నారు.