

రథయాత్రను విజయవంతం చేయాలని భక్తులను కోరిన సురభి నవీన్
జనం న్యూస్, జూన్ 26, జగిత్యాల జల్లా మెట్ పల్లి:
పట్టణంలో, రేపు అనగా 27 జూన్ శుక్రవారం రోజున పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది ఇట్టి రథయాత్ర కీర్తి ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి కొత్త బస్టాండ్ మరియు పాత బస్టాండ్, రాజా కళామందిర్, బస్సు డిపో, ద్వారా వెంకటరెడ్డి గార్డెన్స్, లో రథయాత్ర ముగుస్తుందని తెలియజేశారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవా దేవుడైన జగన్నాధుని రథయాత్రలో పాల్గొని సుభద్ర బలరామ సమేత జగన్నాధుని కృపకు పాత్రులు కావాలని కోరారు రథ యాత్రలో ముగింపు కార్యక్రమాలు సంకీర్తనం ప్రవచనం సంస్కృతిక కార్యక్రమాలు మహా హారతి స్వామివారి భోజన మహా ప్రసాదం వితరణ చేస్తారని మెట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ వారు తెలియజేశారు హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే