Listen to this article

బిచ్కుంద జనవరి 24 జనం న్యూస్:- కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి మౌలిక సదుపాయాలు తదితర వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కోల్డ్ స్టోరేజ్, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ సరఫరా వంటి గదులను వెళ్లి ఆయన పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉందని అన్నారు. ఎమ్మెల్యే వెంట వికారాబాద్ పీడియాట్రిక్ ప్రొఫెసర్ శిరీష కాంగ్రెస్ నాయకులు విట్టల్ రెడ్డి, నాగనాథ్ పటేల్, మహమ్మద్ గౌస్,వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.