

జనంన్యూస్. 26. నిజామాబాదు. రూరల్.
నిజామాబాదు రూరల్ ధర్పల్లి. ఓన్నజిపేట్ .గ్రామ మాదిగలతో సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ కుడాల స్వామి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించుకున్న ఏబీసీ వర్గీకరణ ఫలాలు ఇప్పుడిప్పుడే మన వరకు చేరిన సందర్భంగా మరియు దాని వలన మనకు రాబోవు ఫలితాల కొరకు వివరించడం జరిగింది . అందులో భాగంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం జూలై 7వ తారీఖున ప్రతి గ్రామంలో జెండా గద్దెను నిర్మించి మాదిగ దండోరా జెండాను ఎగరవేసి సంబరాలు చేసుకోవాలని వివరించారు దీనికి మాదిగ జాతి కుల పెద్దలు సమర్ధిస్తూ జెండాను నిర్మిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్ మరియు సిరికొండ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొట్టల దీపక్ మాదిగ కుల సంఘం పెద్దమనుషులు యువకులు, పాల్గొన్నారు