Listen to this article

జనం న్యూస్ జూన్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

కసింకోట మండలంలోని జమ్మాధులపాలెం గ్రామంలో గొఱ్ఱెలు మరియు మేకలకు నట్టల నివారణా కార్యక్రమాన్ని గురువారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహన్ రావు అనకాపల్లి ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ బి. సౌజన్య సర్పంచ్ కరక రాజ్యలక్ష్మి శేషు ఎంపీటీసీ గూడుపు లక్ష్మి రాజు కూటమి నాయకులు ఒమ్మి శ్రీనివాస్, మొల్లి రమణ గూడుపు మణికంఠ ప్రారంభించారు.ఈ కార్యక్రమం ఈ నెల 30 వ తారీఖు వరకు ఉంటుందని పేర్కొన్నారు.నట్టల నివారణ చేయడం ద్వారా జీవాలు ఆరోగ్యంగా చురుకుగా ఉంటాయి మరియు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.జీవాల్లో మాంసం,ఉన్ని దిగుబడి నాణ్యత పెరుగుతుంది మరియు పిల్లల్లో మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.పొట్టేలు సగటున 2 kgs అధిక బరువు పెరిగి 10 శాతం ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉందని పేర్కోన్నారు. ఒకే ప్రదేశంలో మేపకుండా పచ్చిక బయలు తరచుగా నాలుగైదు రోజులకు ఒకసారి మార్చుతుండడం మరియు జీవాలను తేమగల ప్రాంతాల్లో మేపకుండా ఉంచడం వల్ల నట్టల్ని నివారించవచ్చు అని తెలిపారు.వాతావరణ పరిస్థితులు,మేత వనరులు, జీవుల ఉధృతి మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకొని సంవత్సరంలో మూడు నుండి నాలుగు సార్లు నివారణ మందులను త్రాగించాలి. వర్షాకాలం ముందు వర్షాకాలం లో మరియు వర్షాకాలం తర్వాత డివార్మింగ్ చేయాలి. పేడ పరీక్ష ఫలితాలు అనుగుణంగా నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో కసింకోట పసు వైద్యాధికారిణి డా.సిహెచ్.చైతన్య మణి, పశుసంవర్ధక శాఖ సిబ్బంది గోపాలమిత్ర రైతులు పాల్గొన్నారు./)