

యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ముగింపు సందర్భంగా నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ
జనం న్యూస్- జూన్ 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా నల్లగొండ జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో యువత మేలుకో- గంజాయి మానుకో అనే నినాదంతో బిసి కళాశాల విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శీను నాయక్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ వినియోగించడం మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఎన్ డి పి ఎస్ చట్టం 1989 ప్రకారం మాదకద్రవ్య వినియోగం, రవాణా, కొనుగోలు మరియు అమ్మకం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడితే విధించే శిక్షల గురించి విద్యార్థులకు తెలియజేశారు. నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, గంజాయి గుట్కా ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టమని మాదకద్రవ్యాల పట్ల విద్యార్థులు యువత ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలు గమనిస్తూ ఉండాలని డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని అయినా వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.