Listen to this article

బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 26, (జనం న్యూస్):

వైసీపీ రాష్ట్ర “ఆర్టీఐ” జనరల్ సెక్రటరీగా గిద్దలూరు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.

పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి, తనపై నమ్మకం ఉంచి పార్టీ పదవి అప్పగించినందుకుగాను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కేపి.నాగార్జునరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అలాగే తనపై నమ్మకం ఉంచి పార్టీ పదవి అప్పగించినందుకు గాను తనవంతు శాయశక్తుల కృషి చేస్తానని మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వైసీపీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా నియమితులైన కడప వంశీధర్ రెడ్డి ని పలువురు వైసీపీ నాయకులు, ప్రజలు అభినందనలు తెలిపారు.