

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక జిల్లా పరిషత్ గ్రౌండ్ నందు వసతుల కొరతపై మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో యం.పి,రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డినీ శాలువతో సన్మానించి పుష్పగుచ్చాన్నిఅందజేశారు,యం.పి దృష్టికి తీసుకువెళ్లిన ఆరవపల్లె గ్రౌండ్ యూత్, ఎన్నో రోజులుగా జిల్లా పరిషత్ గ్రౌండ్ పరిసర ప్రాంతంలో బాలికల చేంజింగ్ రూమ్ విషయం గా మరియు బలహీనపడిన ప్రహరీ గోడ విషయంగా చాలాసార్లు ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు విన్నవించినట్లు సదరు వార్తలు పత్రిక ముఖంగా ప్రచురించబడిన అయిన ఫలితం లేదని రాజ్యసభ సభ్యుల జోక్యంతో శాశ్వత పరిష్కారానికి కృషి చేయగలరని విన్న వించుకున్నట్లు అరవపల్లి క్రికెట్ లీగ్ టీం సభ్యులు తెలిపారు. ఈ కార్య క్రమంలో:-5th వార్డు నెంబర్ అరుణ్ యాదవ్,హరి ప్రసాద్, హర్ష వర్ధన్, శాంత కుమార్, మహమ్మద్ ఫరూక్, కనకయ్య, జతిన్ జస్వంత్, ప్రవీణ్, వహబ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు..
