Listen to this article

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పూల్‌ బాగ్‌లోని కోర్టు ప్రాంగణంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలు వాడిన, అమ్మిన, రవాణా చేసిన వారిపై చాలా కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు.బెయిల్‌ కూడా దొరకడం చాలా కష్టమన్నారు.