

జనం న్యూస్ జూన్ 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలు, ఆదేశాల మేరకు బీబీపేట్ మండలం లో నూతన కార్యవర్గంను డివిజన్ అధ్యక్షుడు మచ్చేందర్, జిల్లా సహయ కార్యదర్శి చందుపట్ల విఠల్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని గ్రామాల నుండి సభ్యులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా తుమ్మ మచ్చేందర్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మ రవీందర్,కోశాధికారిగా బాలే సహదేవ్ ఉప అధ్యక్షుడిగా తుమ్మ శంకర్, ఉప కార్యదర్శిగా అల్వాల నర్సింలు, కార్యవర్గ సభ్యులు తుమ్మ రాజేందర్, అంకాలం నరేందర్, దుడుగు గణేష్, చింతకింది వేణు,చిలుకమారి భాస్కర్, శివరాత్రి లక్ష్మీనారాయణ, మహిళ సభ్యులు చందుపట్ల జమున, అంకాలం ఉషశ్రీ, అందే లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బీబీపేట్ నుండి బత్తిని జనార్దన్, చందుపట్ల పురుషోత్తం , చందుపట్ల సందీప్ , క్యాదరి రాజు, జనగామ నుండి కిష్టయ్య, శివరాత్రి రామచంద్రం, అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.