Listen to this article

(జనం న్యూస్ జూన్ 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )

మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను అడ్డాలుగా మార్చుకుని మందు బాబులు మధ్యం తాగి సీసాలు వదిలేసి వెళ్లడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పోలాల వైపు వెళ్లగా ఎక్కడ చూసినా వందల కొద్ది ఖాళీ సీసాలు దర్శనమివ్వడంతో వాటిని ఏరుకొని దుక్కి చేస్తున్నారు. కొందరు సీసాలు పగల గొట్టి వేయడంతో గాజు పెంకులు గుచ్చుకుని ఇబ్బంది పడుతున్నారు.తాగి ఖాళీ సీసాలను పోలాల్లోనే కుప్పలుగా పడేసి వాటిని పగలుగొట్టి వెళ్తున్నారు. కొన్ని చోట్ల పంట పొలాల్లో పగలిన సీసా పెంకులు గుచ్చుకుని రైతులు గాయపడ్డ సంఘటనలు కూడా ఉంటున్నాయి. కొంతమంది మహిళా రైతులు, కూలీలు మందుబాబుల భయంతో పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. మందుబాబులు తాగిన మైకంలో అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ప్రమాదం ఉందని భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి. బహిరంగ ప్రదేశాల్లో మధ్యం త్రాగే మందుబాబు లను కట్టడి చేసి, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సాయంత్రం బహిరంగ ప్రదేశాలలో మధ్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.