Listen to this article

జనం న్యూస్ జూన్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారం నాడు పశువైద్య శిభిరం జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ పశువులలో వచ్చే సీజన్ వ్యాధులు రాకుండా వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని పాడి పశువులలో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించుకొని సకాలంలో చూడికట్టేలా చూసుకోవాలన్నారు కార్యక్రమంలో నర్సాపూర్ ఏడి డాక్టర్ జనార్దన్ రావు చిలిపిచేడ్ మండల పశువైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్. అల్లాదుర్గం మండలం పశు వైద్య అధికారి డాక్టర్ రాజు. జె వి ఓ పి. ఆంజనేయులు . ఎల్ ఎస్ ఎ ఆకుల గట్టయ్య మెదక్ జిల్లా గోపాల మిత్ర సూపర్ వైజర్ యం.శ్రీనివాస్ రెడ్డి గోపాల మిత్రులు విజయకుమార్, సంగారెడ్డి ,మానయ్య సిబ్బంది శంకర్, సతీష్ మరియు గ్రామ పాడి రైతులు శశికాంత్, బుచ్చిరెడ్డి,, విఠల్ మరియు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు