Listen to this article

జనం న్యూస్, జూన్ 27, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి

: పట్టణంలో ఈ రోజు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల శిథిలా వ్యవస్థలో ఉందని రానున్న వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మొన్న కరీంనగర్ లో జరిగిన సమావేశం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి వివరించగా మంత్రి వెంటనే కలెక్టర్ కి తెలియజేస్తూ మెట్ పల్లి పాఠశాల లో ఉన్న విద్యార్థులను వేరే ఏదైనా భవనంలోకి మార్చాలని కలెక్టర్ ని ఆదేశించారు,
ఈ యొక్క స్కూల్ నూతన భవన నిర్మాణానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే నిన్న బీఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు గారికి విన్నవించగా వెంటనే ఎంపీ 40 లక్షలు మంజూరు చేయడం జరిగింది,
ఈరోజు ఎమ్మెల్యే పాఠశాలల సందర్శించి వెంటనే ఆ యొక్క భవనాన్ని కూల్చివేయాలని త్వరలో నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని స్కూల్ యాజమాన్యానికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో
ఆర్డీవో శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎంఈఓ చంద్రశేఖర్, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు ఉన్నారు..