

జనంన్యూస్. 27. సిరికొండ.ప్రతినిధి.
సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. వి. ప్రభాకర్ అన్నారు.
శుక్రవారం నాడు సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం. ఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి డీవీ. కృష్ణ 3వ,వర్ధంతి సభను నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనిస్టులు తమ పంథా మార్చుకోవాలని సుదీర్ఘ కాలం పాటు పోరాడి శాస్త్రియ సోషలిజం అన్న సిద్ధాంతాన్ని రూపొందించిన గొప్ప విప్లవ సిద్ధాంత కర్త అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని ప్రజల పాత్ర లేని విప్లవాలు విజయవంతం సాధించావని ప్రజల్లో మమేకమై విప్లవ పోరాటాలు నిర్మించాలని ప్రజాతంత్ర విప్లవ సిద్ధాంతం అందించిన ప్రజాపంథా మార్గదర్శకుడు అన్నారు. ప్రజా సంఘాల అవసరాన్ని గుర్తించి ప్రజా సంఘాల నిర్మాణానికి పూనుకోవాలని గట్టిగా పోరాడిన గొప్ప విప్లవ మేధావి అన్నారు. డివి.కృష్ణను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే అన్నారు. బలమైన విప్లవోద్యమాలను నిర్మించడమే ఆయనకు నివాళులు అర్పించినట్లున్నారు.
కార్యక్రమానికి. ముందు గ్రామంలో గల ఎర్రజెండాను ఎగరావేశారు. ముందుగా డివి. కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు హార్పించారు. సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ మండల నాయకులు కామ్రేడ్.జి. బాల్ రెడ్డి అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ నాయకులు బి. దేవారం, ఎస్. సురేష్, ఆర్. రమేష్ లు ప్రశాంగించగా జిల్లా, డివిజన్ నాయకులు బి. కిశోర్, ఆర్. దామోదర్, జి. సాయరెడ్డి, బి. బాబన్న, ఎం లింబాద్రి, ఇ. రమేష్, జి ఎర్రన్న, వి. భూమాగౌడ్, ఎం.మోహన్, ఎస్. కిశోర్, ఎం. అనిస్, కే. రాంజీ, కే. కిరణ్, ఎం. సాధుల్ల, బి. సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.