

జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శుక్రవారం మోడల్ స్కూల్ హాస్టల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.హస్టల్లో వసతులను,సౌకర్యాలను పరిశీలించారు.అనంతరం బాలికలతో కలిసి ఎంపీడీవో భోజనం చేశారు.భోజనం రుచి, నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థినులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని,హాస్టల్లో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు.
