Listen to this article

జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఈరోజు నగరపాలక సంస్థ విజయనగరంలో పెద్దవీధి మెయిన్ రోడ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గౌరవశ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారి సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)శుక్రవారం పాల్గొని జగన్నాథ స్వామి వారిని దర్శించి జగన్నాథ స్వామివారికి పట్టు వస్త్రాలను పసుపు కుంకుమలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. తదననంతరం ఆలయ పండితులు వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.