Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల కోసం రూ.3.50 ఖర్చు చేస్తుందని తెలిపారు. రైతులు సీఎం యాప్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. మొదటగా యడ్లపాడు మండలంలోని స్పేసెస్ పార్కులో ప్రారంభించామని, రైతులను దృష్టిలో పెట్టుకొని రెండవ కొనుగోలు కేంద్రాన్ని జిడి సిఎంఎస్ చైర్మన్ హరిబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు. పొగాకు రైతులు గ్రేట్ ల వారిగా చేసుకోవడమే కాకుండా తేమశాతం లేకుండా చూసుకోవాలన్నారు. పంటలను పిచికారి చేసేందుకు రైతులకు ఎనిమిది లక్షల సబ్సిడీ ఇచ్చి,రూ 2 కట్టుకునే విధంగా రైతులకువెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ పనిముట్లను ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్నిదే కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.