Listen to this article

జనం న్యూస్ జూన్ 27 నడిగూడెం

గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతూ మృతి చెందిన రామాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుక్కడపు పున్నయ్య పార్దివ దేహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూతుకూరి వెంకట రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కి పున్నయ్య చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీ కి తీరని లోటు అన్నారు. ఆయన వెంటకాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, సిరిపురం గ్రామ మాజీ సర్పంచ్ మొక్క బిక్షపతి, రత్నవరం గ్రామ మాజీ సర్పంచ్ రామిని విజయ్ వర్దన్ రెడ్డి,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.