

జనం న్యూస్,జూన్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
జగదేవపూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన తిగుల్ల రాజు వారం రోజుల క్రితం అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకున్నాడు, కష్ట కాలం లో ఉన్న కుటుంబ సభ్యుల ఉన్నారన్న విషయం తెలుసుకుని బి జి వెంకటపూర్ గ్రామానికి చెందిన చెక్కల మహేష్,రియల్ ఎస్టేట్ శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం కుటుంబానికి ఆసరాగా అండగా నిలిచి ₹ 5,000/- రూ. ఆర్థిక సాయం చేసి మానవతా దృక్పథం చాటుకున్నారు, ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అప్పుల బాధతో ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని అన్నారు.
రోజు కూలీ చేసుకుని జీవించే ఆ కుటుంబానికి పిల్లలను పోషించడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు
మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గొల్లపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ సిద్ధులు,కొండాపూర్ గ్రామస్తులు కృష్ణ,రాజు,శ్రీలత,కృష్ణ, లక్ష్మణ్,జహంగీర్,శ్రీను,రమేష్, తదితరులు పాల్గొన్నారు.
