

జనంన్యూస్. 28.సిరికొండ.ప్రతినిధి.
ప్రభుత్వ విద్య సంస్థలలో పిడి ఎస్ యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా. నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో PDSU మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించటం జరిగింది. ఈ సందర్బంగా సిరికొండ మండల అధ్యక్షులు మారుపాక రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో రాష్ట్ర కమిటీ పిలుపులో బాగంగా క్షేత్ర స్థాయిలో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సర్వేలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల స్తితి గతులు తెలుసుకోవడానికి సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ,పెరిగిన విద్యారుల సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూమ్స్ నిర్మించాలని , నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు రితీష్ గౌడ్,నవీన్,విశ్వతేష్, తదితరులు పాల్గొన్నారు.