Listen to this article

జనం న్యూస్ . జనవరి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రెహమాన్):- మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు లిస్టులో ఉన్న వారి పేర్లను తెలుపాలని అధికారులకు సూచించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.ఎలాంటి లోటుపాటు లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క నిరుపేద లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అన్నారు, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు డ్రామాగా మారాయని అన్నారు,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు, గ్రామ సభల పేరుతో చేస్తున్న డ్రామాలను ఆపేసి అర్హులైన వారందరికీ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ జెడ్పి సీఈవో స్వప్న, ఇరిగేషన్ అధికారి భూపుత్ర, ఎంపీడీవో శంకర్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ ఆగమయ్య గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.