Listen to this article

(జనం న్యూస్ చంటి 28)

‘ఒకే దేశం ఒకే కులం ఒకే జాబితా’ అన్న రజకుల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని కేంద్ర సామాజిక సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. హైదరాబాద్ పర్యటన కు వచ్చిన కేంద్ర మంత్రిని రజక సంఘాల నేతలు కలిసి రజకుల ను ఎస్సి జాబితాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతిపత్రం మంత్రికి సమర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘాల నేతలు ముత్యాల నర్సింలు, కోట్ల శ్రీనివాస్, కొన్నే సంపత్, సంగం శ్రీనివాస్, బర్లపాటి జయరాం, కుమారస్వామి, GST డిప్యూటీ కమిషనర్ అశోక్ తదితరులు మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బట్టలు ఉతికే రజకులు ఎస్సి జాబితాలో ఉన్నారని, అదే వృత్తి చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రజకులకు కూడా ఎస్సి హోదా కల్పించాలని కోరారు. తాము కేంద్రం లో అధికారం లోకి వస్తే రజకులను ఎస్సిల్లో చేరుస్తామని పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత నేత రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల సభలో ప్రకటించిన విషయాన్నీ గుర్తు చేశారు. తమ డిమాండ్ పై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు సానుకూలంగా అసెంబ్లీ లోపల, బయట మాట్లాడారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం పై సమగ్ర వివరాలతో రావాలని, సంబందిత ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ వర్గాలతో సమావేశం కావడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.