Listen to this article

నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.

వివరాలు వెల్లడించిన. సీఐ నయీముద్దీన్. ఎస్సై శ్రీధర్ రెడ్డి.

జనం న్యూస్. జూన్ 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. బ్లేడుతో గొంతు కోసి పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిన్నారం సీఐ నయీముద్దీన్ తెలిపారు, శనివారంనాడు సీఐ నయీముద్దీన్, హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి.తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఈనెల 25వ తేదీన కాసాల గ్రామ శివారులో గల ఇప్పలకుంటలో పాక్షికంగా కాలిన గుర్తు తెలియని యువకుడి శవం లభ్యం కావడంతో హత్నూర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు‌.దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి హత్య కేసును దర్యాప్తు చేపట్టగా హత్నూర మండల పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన ఎరుకల శ్రీను 25 సం. తండ్రి సాయిలు వృత్తి ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్ గా పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడని దర్యాప్తుల్లో గుర్తించామని తెలిపారు,అదేవిధంగా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఎరుకల శీను అతని దూరపు బంధువైన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎరుకల మల్లేశం,వీరిద్దరూ గతంలో దొంగ తనం కేసులో పాత నేరస్తులుగా గుర్తించినట్టు సీఐ తెలిపారు. వీరిద్దరి మధ్య పాత కేసు ఇతర తగాదాల ఉన్నట్లు తెలిపారు,ఈ తగాదాలను మల్లేష్ మనసులో పెట్టుకొని . ఎరుకల శీను ని బ్లేడుతో గొంతు కోసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడని నిందుతుడు మల్లేష్ ఒప్పుకున్నట్లు సిఐ నయీముద్దీన్ ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు,నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు,