

జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఎస్.కోట మండలంలోని ముసిడిపల్లి గ్రామానికి చెందిన జిందాల్ నిర్వాసీతుడు సన్యాసిరావుపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. జిందాల్ పోరాటంపై విశాఖలోని న్యాయవాదిని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా దారి కాసి ముగ్గురు దాడి చేశారని బాధితుడు చెప్పాడు. పోరాటం ఆపకపోతే తన భార్య, బిడ్డలను చంపేస్తామని బెదిరించారని చెప్పాడు. దీనిపై కేసు నమోదైంది.