

కాంగ్రెస్ నాయకులు కోట రవి
(జనం న్యూస్ .29. జూన్ భీమారం మండలప్రతినిధి కాసిపేట రవి)
మంచిర్యాల జిల్లా భీమారం మండలం విలేకరుల సమావేశంలో కోట రవి మాట్లాడుతూ
పత్రికలు, చానళ్లు.. విషయాలను వెలుగులోకి తెస్తాయి.. వాటిలో తప్పులు ఉంటే కౌంటర్ ఇవ్వాలి.. లేదా ప్రశ్నించాలి.. న్యాయబద్ధంగా పోరాడాలి.. కానీ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ గుండాలా వ్యవహరించారు.. పత్రికా స్వేచ్ఛపై దాడికి పూనుకున్నారు.. రాళ్లతో కొట్టి మహా టీవీ ఛానల్ కార్యాలయాన్ని బద్దలు చేశారు. రాజధాని వేదికగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన ఈ పని పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇదీ దారుణం.ప్రస్తుతం ట్రెండిగ్ లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మహా టీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం బీఆర్ఎస్ యువనేత, మాజీమంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉంది. దీనితో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా హైదరాబాదులోని మహా టీవీ ఛానల్ పై దాడి చేశారు. రాళ్లతో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతుంది. నూటికి నూరుపాళ్ళు ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని రవి విమర్శించారు. ఒకవేళ ప్రచురించిన కథనం తప్పుగా ఉంటే కౌంటర్ అవకాశం ఉంది. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ గుండాలలాగా వ్యవహరిస్తూ ఆ పార్టీ వర్గాలు చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పై స్పందిస్తూ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోట రవి డిమాండ్ చేశారు.