Listen to this article

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి


బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ నూతన అద్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు వారికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం రాష్ట్ర ఉపాద్యక్షులుగా ఉన్నారు.గతంలో ఆంద్రప్రదేశ్ శాసనమండలిలో బిజెపి ప్లోర్ లీడర్ గా ,ఆర్ ఎస్ ఎస్,బిజెవైఎంలో వివిధపదవుల్లో చేశారన్నారు మాధవ్ ఏకగ్రీవం కావడం పట్ల అబినంధనలు తెలిపారు.మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారని వీరన్న చౌదరి తెలిపారు