

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 1 రిపోర్టర్ సలికినీడి నాగు
మహా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు.
చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని ప్రతిమత కూడిన గోడ పత్రికలను పట్టణ ములోని యనార్టీ సెంటర్లో గల సంఘం కార్యాలయంలో నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ నెల 6వతేది ఆయన జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ మహాభారతంలో గురు భక్తిని చాటిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏకలవ్యుడని నాయకులు కొనియాడారు. ద్రోణాచార్యుని గురుకులంలో విలు విద్యను అభ్యసించాలని కోరికతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లడంతో ఆయన తిరస్కరిస్తారు. ఎలాగైనా విలువిద్య నేర్చుకోవాలనే దృఢమైన సంకల్పం తో ద్రోణాచార్యుని ప్రతిమను బంకమట్టితో తయారు చేసి అతని విగ్రహాన్ని ప్రతిష్టించికొని విలువిద్యను నేర్చుకున్న మహోన్నతమైన వ్యక్తి ఏకలవ్యుడు అని నాయకులు తెలిపారు. తన గురు భక్తిని చాటుకోవడం కోసం బ్రొటన వేలు ను త్యాగం చేసిన మహావీరుడు ఏకలవ్యుడు అని నాయకులు తెలిపారు. ఈ నెల 6 వతేదిన తొలి ఏకాదశి పండుగ రోజున స్థానిక రైతు బజార్ ఎదురుగా ఉన్న ఏకలవ్యుడు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వచేస్తున్నారూ. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిసున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి కుంభ నాగేశ్వరరావు,విశ్రాంత సైనిక ఉద్యోగులు కె. మంత్రు నాయక్, గౌరవ అధ్యక్షులు బి.చిన్న నాయక్, అధ్యక్షులు పాల పర్తి శ్రీనివాసరావు,కౌన్సిలర్ వి.కోటా నాయక్,నాయకులు యం.వెంకటేష్ నాయక్,బి.శివ నాయక్,కానగాల బాబు, ఆర్.హరి నాయక్,తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.