

జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
అటు ప్రజలకు,ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గుర్తించి గొంతెత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని హత్నూర జర్నలిస్టులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్నటువంటి మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై కొంతమంది నాయకులు మీడియా వ్యవస్థలను అనగా తొక్కాలనే దురాలోచనతో ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడడం సబబు కాదని మండిపడ్డారు.ఈ సందర్భంగా హత్నూర జర్నలిస్టులు మహాన్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం నాడు నిరసన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ మహాన్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో మీడియా సంస్థలపై జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో. హత్నూర మండల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.