Listen to this article

జనం న్యూస్ 03 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

నేడు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో పలు సమస్యల మీద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. భానుమూర్తి తెలియజేశారు. మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ గత ఆరేళ్లుగా పెండుంగులో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి,ఆర్టీసీలో ఖాళీ ఉన్న 10 వేల మంది సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా మహిళ ఉచిత ప్రయాణంతో ఆర్టీసీగా అనేక ఇబ్బందులు తలెత్తునున్నాయి,మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం సక్సెస్ కావాలంటే వెంటనే కాలం చెల్లిని బస్సులు స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలన్నారు.జనవరి 1వ తేదీ 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చేరడం జరిగింది అన్నారు నాటి నుంచి 2025 జూన్ రెండు వరకు రిటైర్డ్ అయిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిట్స్ గాని సరెండర్ లీవ్స్ గాని గ్రాడ్యుటి గాని ప్రావిడెంట్ ఫండ్ గాని అందలేదన్నారు ప్రభుత్వం నుంచి రావలసిన బెనిఫిట్స్ రాకపోవడంతో వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు వాటన్నిటిని వెంటనే ప్రభుత్వం విడుదల చేసి ఆర్టీసీ కార్మికుల కష్టాలను తీర్చాలన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భధ్రత కల్పించాలి, ఆర్టీసి ఔట్ సోర్శింగు ఉద్యోగులను ఆప్కాస్ లో చేర్చాలి. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి. రవికుమార్. డిపో అధ్యక్షులు ఎన్ స్వామి, డిపో కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిహెచ్ పి పట్నాయక్, జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు ఏ. అశోక్ , యూనియన్ నాయకులు పాల్గొన్నారు.