

జనం న్యూస్: రైలు ప్రయాణ సమయాల్లో ఎంత మంచి అనుభూతి కలుగుతుందో.. అప్రమత్తంగా లేకపోతే అంతే స్థాయిలో షాక్ కూడా తగులుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఊహించని ప్రమాదాల బారిన పడే వారిని చూస్తుంటాం. అలాగే అదే నిర్లక్ష్యంగా ఉంటూ విలువైన వస్తువులను పోగొట్టుకునే వారిని కూడా చూస్తుంటాం. ప్రధానంగా కిటికీ పక్కన కూర్చున్న వారి వస్తువులను దొంగలు లాక్కెళ్లిపోవడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ కాన్ఫూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రైలు స్టేషన్ నుంచి కదిలేందుకు సిద్ధంగా ఉండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా రైలు కదిలే సమయంలో ఓ దొంగ కిటికీ నుంచి లోపలికి చేతులు పెట్టి వస్తువులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే ఆ సమయంలో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దొంగ చేతులను పట్టుకుంటారు. అప్పటికే రైలు కదలడంతో దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత ప్రయాణికులు మానవత్వంతో ఆలోచించి.. అతడు కిందపడకుండా చేతులు పట్టుకుంటారు. ఇంత జరుగుతున్నా ఆ దొంగ ముఖంలో కొంచెం కూడా భయం కనిపించదు. రైల్లోని సీటు పట్టుకుని ఆడుకుంటూ కనిపిస్తాడు. దీంతో ప్రయాణికులంతా అతన్ని వింతగా చూస్తారు. ఇలా ఆ దొంగ చాలా దూరం వరకూ అలాగే వేలాడుతూ వెళ్లినట్లు తెలిసింది. చివరకు కొందరు ప్రయాణికులు చైన్ లాగి, దొంగను పోలీసులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలి”.. అంటూ కొందరు, ”ప్రయాణికులు మానవత్వం ప్రదర్శించడం గ్రేట్”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్‌లు, 3.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
https://www.instagram.com/reel/DE2q50bTjAK/?utm_source=ig_web_copy_link