Listen to this article

జనంన్యూస్. 03.సిరికొండ. ప్రతినిధి.

సిరికొండ మండలంలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచడానికి గాను మండలంలోని మూడు సొసైటీలు మరియు ప్రైవేట్ డీలర్స్ ద్వారా యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది. సిరికొండ మండలంలో యూరియాను రైతులకు అందించడం జరుగుతుంది. మండలానికి రావలసిన యూరియా దఫళ వారీగా జిల్లా నుంచి సొసైటీలకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటివరకు సొసైటీ మరియు ప్రైవేట్ డీలర్స్ ద్వారా 1200 మెట్రిక్ టన్స్ యూరియా రైతులకు అందించడం జరిగింది. ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లారీలు యూరియా మండలానికి తీసుకురావడం జరుగుతుంది. రైతులు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందావద్దు.