

జనం న్యూస్ జూలై 3, పరిగి నియోజకవర్గ ఇన్చార్జి, ( హనుమంత్ రెడ్డి )
వికారాబాద్ జిల్లా నూతన జిల్లా వైద్య అధికారిగా నియమితులైన డి ఎం హెచ్ ఓ డాక్టర్ లలితాదేవి పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ని, హైదరాబాదులో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా డాక్టర్ లలితాదేవి కలిశారు . ఈ సందర్భంగా జిల్లాలోని ఆరోగ్య సేవలు పరిస్థితులపై చర్చ జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నూతన డిఎంహెచ్ఓ లలితాదేవి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలోని మెరుగైన ఆరోగ్య సేవల కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.