

జనం న్యూస్ జూలై 3 మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపిచేడ్ మండలంలోని వివిధ పాఠశాలను ఆకస్మికంగా జిల్లా విద్యాధికారి తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రాథమిక పాఠశాల చిలిపిచేడ్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలిపిచేడ్ ,కస్తూరిబాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను తనిఖీ చేయడం జరిగింది . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలిపిచేడ్ లో ఉపాధ్యాయుల హాజరు ,పాఠ్య ప్రణాళికలు ,దినచర్య , తరగతి గది బోధన ,విద్యార్థుల అభ్యాసన రికార్డ్ షీట్లు పరిశీలించి తరగతి గదిలో ప్రత్యక్షంగా విద్యార్థులచే మాట్లాడి ఉపాధ్యాయుల బోధన మరియు విద్యార్థుల ప్రగతిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది . జిల్లా విద్యాధికారి అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుండి సరైన సమాధానాలు వచ్చినందుకు విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది . అదేవిధంగా మండలంలో నూతనంగా ప్రారంభమైన కస్తూరిబా జూనియర్ కళాశాల ను సందర్శించి వసతి సౌకర్యాలు మరియు బోధన సిబ్బందిని గురించి అక్కడ ఉన్న విద్యార్థుల తో మాట్లాడడం జరిగింది .జిల్లా విద్యాధికారి వెంట మండల విద్యాధికారి విట్టల్ ,కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమేష్ పాల్గొన్నారు