

జనం న్యూస్,జూలై03,అచ్యుతాపురం:
రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఉత్తరాంధ్ర వ్యవహారాలు ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని సతీష్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్న సతీష్ ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన ఉమ్మడి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.