

జనం న్యూస్ జులై 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జూలై 2 వ తేదీ నుంచి మొదలైన సుపరిపాలన పై ఈరోజు ఉదయం 81 డివిజన్ లో మాజీ శాసన మండలి సభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని పరమేశ్వరి పార్క్ జంక్షన్,పీలా వెంకటరెడ్డి నాయుడు వీధి, పోలమరశెట్టి వారి వీధి, ఉమెన్స్ కాలేజీ వీధి లలో ప్రజల వద్దకు వారి ఇంటికి వెళ్లి ఇంటి సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై అభిప్రాయం qతెలుసుకొని గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు మీ ఇంటికి ఏ ఏ పథకాల వచ్చాయో తెలుసుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు అందే విధంగా తొలి ఏడాదిలోనే యువతకు ఉద్యోగ అవకాశాల కోసం మెగా డీఎస్సీ ప్రకటన చేసి 16,347 పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీపం పథకం ద్వారా ఉచిత దీపం పథకంలో ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు కోసం 2601 కోట్లు, తల్లికి వందనం ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించి, అందులో 2000 స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం ఖర్చు చేస్తున్నారని, దీనిపై వైసీపీ మూకలు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు తప్పుడు సాంకేతలు ఇస్తున్నారని, దీన్ని ప్రజలు తిప్పుకొడుతున్న వైసీపీకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని నాగ జగదీష్ ఘాటుగా విమర్శించారు.సూపర్ సిక్స్ పథకంలో ఇప్పటికే మెగా డీఎస్సీ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్ ప్రయాణం మహిళల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం కేంద్రంతో పాటే రాష్ట్ర నిధులు జోడించి వారి ఖాతాల్లో వేస్తున్నారని ప్రజలకు నాగ జగదీష్ వివరించారు. ప్రజలను స్వయంగా కలుసు కోవడంతో కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలoటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి మా సంపూర్ణ మద్దతును ఎల్లవేళలా ఉంటుందని ప్రజలు కితాభిచ్చారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చదరం శివ అప్పారావు కోట్ని రామకృష్ణ పెంటకోట శివ మల్ల గణేష్ కుప్పిలి జగన్మోహన్ విల్లూరి రమణబాబు కర్రీ మల్లేశ్వరరావు పోలిమేర నాయుడు బుద్ధ భువనేశ్వరరావు కాండ్రేగుల రవీంద్ర బుద్ధ లక్ష్మీ అప్పారావు సూరిశెట్టి బల్లమ్మ సాలాపు నాయుడు రామోజు శ్యామసుందర్ శ్రీకాకుళం గణపతి కొణతాల బాబురావు కోరిబిల్లి మహాలక్ష్మి నాయుడు కొణతాల బాల దాడి వేణు వేగి నాయుడు కొణతాల శీను బుద్ద జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు.