

మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైసీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి.
కంభం సర్కిల్ ప్రతినిధి, జూలై 03 (జనం న్యూస్):
ప్రకాశం జిల్లా, కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో కలిశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడండి అని పిలుపునిచ్చిన జగన్ మోహన్ రెడ్డి మనం చేసిన మంచిని ప్రజలకు తెలిసేటట్టు చేయవలెనన్నారు. మార్కాపురం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఎటువంటి పొరపాట్లు జరగకుండా పని చేయవలసిందిగా కోరారు. పాలక ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలను ప్రజలకు గుర్తు చేయమన్నారు.