

రెండు చోరీ కేసుల్లో నిందితుడికి ఐదు సం.ల 8మసాల జైలు, జరిమాన
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్
జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రామభద్రపురం పోలీసు స్టేషన్లో 2023, 2024 సం.లో ఒక ఇంటిలోను, మరో షాపులోను చోరీలకు పాల్పడిన నిందితుడు మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన జోకాడ భగవాన్ (22 సం.లు)కు ఐదు సం.ల 10 మసాల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సాలూరు JFCM మెజిస్ట్రేట్ జి.హర్ష వర్ధన్ తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జులై 3న తెలిపారు.
2023సం.లలో ఇంటిలో వాళ్ళు నిద్రిస్తున్న సమయంలోను, 2024 సం.లో SBI కన్స్యూమర్ సర్వీస్ పాయింట్ షాపులోకి నిందితుడు జోకాడ భగవాన్ (22 సం.లు) ఇంటిలోకి ప్రవేశించి, తులం బంగారు చెవి దిద్దెలు, రూ.1.60 లక్షల నగదు, ఒక ల్యాప్ టాప్ దొంగిలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై రామభద్రపురం పోలీసులు రెండు చోరీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, చోరీ సొత్తు రికవరీ చేసి, అభియోగ పత్రం దాఖలు చేశారు. న్యాయ స్థానంలో నిందితుడు జోకాడ భగవాన్ పై నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడికి ఐదు సం.ల 8మసాల సాధారణ జైలు, రూ.8 వేలు జరిమాన విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో మూడు మాసాలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని సాలూరు JFCM మెజిస్ట్రేట్ శ్రీ జి.హర్ష వర్ధన్ గారు తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కేసుల్లో పోలీసు వారి తరుపున APP వి.హెచ్.కే.శర్మ వాదనలు వినిపించగా, బొబ్బిలి రూరల్ సిఐ కే.నారాయణరావు, రామభద్రపురం ఎస్సై వి.ప్రసాదరావు న్యాయ స్థానంలో సాక్షులు, ఆధారాలను సకాలంలో ప్రవేశ పెట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.