Listen to this article

జనం న్యూస్ జూలై 4 కోనసీమ జిల్లా


మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మండపేటలో మయూరి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు

ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగాసుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా, సభాపతిగా, ముఖ్యమంత్రిగా మాజీ గవర్నర్ సహా పలు పదవుల్లో పని చేశారు.ఆర్థిక మంత్రి హోదాలో 15 పైగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకునపెట్టే నైపుణ్యం ఆయన సొంతం తెలుగు రాజకీయాల్లో అందరివాడు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాళ్ళకూరి శ్రీనివాస్, కోనసీమ జిల్లా అధ్యక్షులు వాకచర్ల గుప్తా, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల ప్రసాద్, వాసవి సేవాదళ్ చైర్మన్ కేశవరపు శ్రీనివాస్, నాలం కిట్టు సోషల్ మీడియా చైర్మెన్ మద్దుల సుబ్బారావు, మండల సెక్రెటరీ వాకచర్ల నాగబాబు, వైస్ ప్రెసిడెంట్ చామర్తి లావరాజు, బలబద్రపు రాజు, వెచ్చా సుబ్బారావు పాల్గొన్నారు