Listen to this article

బిచ్కుంద జులై 4 జనం న్యూస్

బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి బిచ్కుంద టౌన్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికై జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బిచ్కుంద మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నామని సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు. సురేష్ గొండ పాల్గొని మాట్లాడుతూ. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని. పిఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యం కల్పించి కనీస వేతనం. 26వేల రూపాయలు ఇవ్వాలని. ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లించాలని. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈ సందర్భంగా సురేష్ గొండ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. బిచ్కుంద మున్సిపల్ కార్మికుల సంఘం. అధ్యక్షులు. భూమయ్య. ప్రధాన కార్యదర్శి. రాజు. కార్మికులు. సాయిలు. సాయిరాం. తదితరులు పాల్గొన్నారు