

జనం న్యూస్ జులై 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఉదయం 84వ వార్డులో చేపల బజారులో మత్స్యకారులు యోగ సమాచారాలు అడిగి తెలుసుకుని, వ్యాపారం ఎలా సాగుతుంది, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయా, మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు వివరాలు అడిగి తెలుసుకుని తల్లికి వందనం స్కీములో 15000 రూపాయలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సముద్రంలో వేట నిషేధం సమయంలో మీ కుటుంబాల జీవన మృతికి 20000 రూపాయలు గతంలో కంటే పెంచి ఇస్తున్న విషయం మీకు తెలుసా అడిగిన సందర్భంగా మా ఖాతాలో ఇప్పటికే జమ అయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని, పది కాలాలపాటు పేదలకి సహాయం చేసే విధంగా అతను ఆరోగ్యం బాగుండాలని అమ్మోరు తల్లికి మొక్కుతున్నామని నాగ జగదీష్ కి తెలిపారు. మీ మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మీకు భరోసా కల్పిస్తారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోడి వెంకటరావు కుప్పిలి జగన్ పిల్లా తారకేసు కాండ్రేగుల జగదీష్ శ్రీకాకుళం గణపతి రేబాక లోవరాజు రేబాక ఈశ్వర అప్పారావు సూరిశెట్టి బల్లమ్మ కాండ్రేగుల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.//