Listen to this article

జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


కాకతీయ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు శుక్రవారం రోజున ఎస్ ఎఫ్ ఐ బీ ఆర్ ఎస్ వి ఎ ఐ ఎఫ్ డి ఎస్ పి డి ఎస్ యు ఎస్ ఎస్ యు డి ఎస్ ఎ ఎ ఐ డి ఎ ఐ డి ఎస్ ఓ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లోని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పరిపాలన భవనం వరకు యూనివర్సిటీ పాలక మండలీ సభ్యుల దిష్టిబొమ్మతో శవయాత్ర ర్యాలీ నిర్వహించి అనంతరం పరిపాలన భవనం ముందు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ బిఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగర్జున పి డి ఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్ స్వారో స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ డీఎస్సీఎ రాష్ట్ర కన్వీనర్ శ్రావణ్ కుమార్ గణేష్ ఏ డి ఎస్ ఓ రాజేష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు కట్టేందుకు యూనివర్సిటీ భూముల ను 15 ఎకరాలను స్థానిక ఎమ్మెల్యే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పాలకమండలీ సభ్యులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కాకతీయ యూనివర్సిటీలో 15 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూలు కట్టేందుకు ఆమోదం తెలుపుకున్నారన్నారు ఎవరిని అడిగి వారు ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసుకొని ఆమోదం తెలుపుకున్నారని మేము అడుగుతున్నామన్నారు గతంలో యూనివర్సిటీ భూములను కొంతమంది దుండగులు కబ్జా చేసిన కూడా ఇప్పటివరకు వారి పైన ఎలాంటి చర్యలను తీసుకోలేదన్నారు ఈ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు కూడా తొమ్మిది ,పది ఎకరాలను ఆక్రమించి వాడుకుంటున్నారన్నారు మళ్లీ ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీలో 15 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు కట్టేందుకు పన్నాగం పన్నుతున్నారన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూలు కాకతీయ యూనివర్సిటీలో కాకుండా బయట కట్టాలన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ భూముల జోలికి ఎందుకు వస్తున్నారు అని అన్నారు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాకతీయ యూనివర్సిటీ భూములే మీకు మీ ప్రభుత్వానికి కనబడుతున్నాయా అని అన్నారు స్థానిక ఎమ్మెల్యే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాలక మండల సభ్యులు కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ‌స్కూలు కట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మేము పూర్తిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు మీరు ఇలానే ఎక పక్షంగా ఉంటే యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ఎస్ఎఫ్ఐ ‌ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు చెన్నూరి సాయికుమార్ బిరెడ్డి జస్వంత్ వివిధ సంఘాల నాయకులు గణేష్ సావిత్రి పవన్ కుమార్ సందీప్. అజయ్ ప్రదీప్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు….